అయ్యో ‘బాబు’! | Chandrababu Naidu Election Campaign fail in Tamil Nadu | Sakshi
Sakshi News home page

అయ్యో ‘బాబు’!

May 5 2026 4:37 AM | Updated on May 5 2026 4:37 AM

Chandrababu Naidu Election Campaign fail in Tamil Nadu

తమిళనాట చంద్రబాబు ప్రచారం 

చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ మూడోస్థానానికి ఎన్డీఏ అభ్యర్థులు   

సాక్షి, చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో ముఖ్య­మంత్రి చంద్రబాబు చేసిన ప్రచారం అసలు ఫలించలేదు. పైగా ఆయన ప్రచారం చేసిన చోటల్లా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు మూడో­స్థానానికి పరిమితం కావడం గమనార్హం. కోయంబత్తూరు జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా నాలుగింటిలో బీజేపీ, అన్నాడీఎంకేకు చెందిన కీలక నేతలు పోటీ చేశారు. వీరికి మద్దతుగా సీఎం చంద్రబాబు  ప్రచారం చేసినా ఫలితం శూన్యం. కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి సెంథిల్‌ బాలాజీ గెలు­పొందగా ఎన్డీఏ కూటమికి చెందిన అన్నా­డీఎంకే అభ్యర్థి అమ్మన్‌ అర్జునన్‌ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.

కోయంబత్తూరు ఉత్తరం నియోజకవర్గంలో పోటీ చేసిన బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్‌ కూడా మూడోస్థానానికి పరిమితం కావడం గమనార్హం. పొల్లాచ్చిలో వి.జయరామన్‌  2వ స్థానానికి పరిమితమయ్యారు. చెన్నై అన్నానగర్‌లో అన్నాడీఎంకే అభ్యర్థి గోకుల ఇందిర, సాత్తూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌కు మద్ద­తుగా చంద్రబాబు రోడ్‌షోలు నిర్వహించారు. ఈ రెండుచోట్ల ఎన్డీఏ అభ్యర్థులకు ఓటమితప్పలేదు. ఇదిలా ఉంటే ఆవడిలో బీజేపీ అభ్యర్థి  అశి్వన్‌కుమార్‌కు మద్దతుగా టీడీపీ కేంద్రమంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని ప్రచారం చేసినా ప్రజలు తిరస్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement