Nasal Covid Vaccine: కరోనా వేళ భారత్‌ బయోటెక్‌ కీలక నిర్ణయం.. బూస్టర్‌ డోస్‌ నాజల్‌ వ్యాక్సిన్‌ రెడీ!

Bharat Biotech Nasal Covid Vaccine Rolled Out As Booster Dose - Sakshi

పలు దేశాల్లో కరోనా వైరస్‌ వేరియంట్ల వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తి కట్టడి కోసం పలు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై మరోసారి ఫోకస్‌ పెట్టింది. ముఖ్యంగా బూస్టర్‌ డోస్‌ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. 

ఇదిలా ఉండగా.. భారత్‌ బయోటెక్‌ సంస్థ కరోనా వ్యాక్సిన్‌ విషయంలో మరో అప్‌డేట్‌ ఇచ్చింది. ముక్కు ద్వారా అందించే(నాజల్‌ స్ప్రే) కోవిడ్‌ వ్యాక్సిన్‌ను త్వరలో దేశంలో బూస్టర్‌ డోస్‌గా తీసుకువస్తున్నట్టు పేర్కొంది. గోవాగ్జిన్‌ టీకా నుంచి నాజల్‌ వ్యాక్సిన్‌ రూపంలో దీన్ని అందించనున్నారు. డీజీసీఏ నుంచి తుది ఆమోదం పొందిన వెంటనే బూస్టర్‌ డోస్‌ రిలీజ్‌చేయనున్నట్టు సమాచారం. జాతీయ మీడియా సమాచారం మేరకు నాజల్‌ వ్యాక్సిన్‌కు అనుమతులు చివరి దశకు చేరుకున్నాయని, వచ్చే వారంలో టీకా అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. 18 ఏళ్లుపైన వయసు ఉన్న వారికి బూస్టర్‌ డోస్‌గా నాజల్‌ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. 

నాజల్ వ్యాక్సిన్‌ వల్ల ప్రయోజనం?
నాజల్ వ్యాక్సిన్‌లు ఇంజెక్షన్‌ ద్వారా తీసుకునే వ్యాక్సిన్‌తో పోలిస్తే అదనపు ప్రయోజనాలను కలిగి వున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే, నాజల్‌ వ్యాక్సిన్లను నిల్వ సౌలభ్యం, పంపిణీలో సులభంగా ఉంటుంది. నాజల్ వ్యాక్సిన్‌లు వైరస్.. మానవ శరీరంలోకి ప్రవేశించే ముక్కు , ఎగువ శ్వాస కోశం వద్ద రక్షణను అందిస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top