Anand Mahindra: మరో టాలెంట్‌; నెటిజన్లు ఫిదా!

Anand Mahindra shares old picture of school days netizens delighted - Sakshi

స్కూలు ఫోటో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్ర

స్నేహితుడు నిక్‌ పాటకు ఆనంద్‌ మహీంద్ర ఫిదా 

ఆనంద్‌ మహీంద్ర మరో ట్యాలెంట్‌కు నెటిజన్లు ఫిదా!

సాక్షి, ముంబై:  ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా నిత్యం వార్తల్లో ఉంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తాజాగా ఆనంద్ మహీంద్రా పాఠశాల రోజులనాటి పాత చిత్రాన్ని పంచుకున్నారు.  తద్వారా తనలోని మరో ప్రత్యేక టాలెంట్‌ను కూడా బైటపెట్టారు. స్కూల్‌ బ్యాండ్‌లో భాగంగా గిటారు వాయిస్తున్న ఒక ఫోటోను షేర్‌ చేశారు. దీంతో ఈ ఫోటోలు వైరల్‌ అవ్వడమేకాదు..ఆయన గిటారు వాయిస్తున్న వీడియోను షేర్‌ చేయాలని కోరుతున్నారు. 

అసలు విషయం ఏమిటంటే 1973 నాటి మళయాల చిత్రం మారం మూవీలోని ‘పాతినాలాం రావుదిత్తురు’ పాటను అద్భుతంగా ఆలపించిన పాట ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.  అది కాస్తా ఆనంద్‌ మహీంద్ర దాకా చేరింది. ఆనంద్‌ మహీంద్ర బాల్యమిత్రుడు నిక్‌దే ఈ వీడియో. దీంతో తన పాఠశాల రోజుల నాటి తీపిగుర్తులను ఆనంద్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఊటీలో ఉండగా నిక్‌తో తన చిన్ననాటి అనుభవాల్లోకి జారుకున్నారు. అంతేకాదు నిక్‌ పాట పాడిన తీరు, ఆయన డిక్షన్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ వీడియో చూసే దాకా నిక్‌ మలయాళంలో ఇంత స్పష్టంగా పాడతాడని ఊహించలేదని వ్యాఖ్యానించారు.

ఇండియాలో ఊటీలో స్థిరపడిన బ్రిటిష్ కుటుంబానికి చెందిన తన చిన్ననాటి స్నేహితులు నాగు అండ్‌ ముత్తు, (నికోలస్ హార్స్‌బర్గ్, అతని సోదరుడు మైఖేల్‌) గుర్తు చేసుకున్నారు.  తాను జూనియర్‌ అయినప్పటికీ తన ది బ్లాక్‌ జాక్స్‌ బృందంలో చేర్చుకున్నాడు నిక్‌ (నికోలస్ హార్స్‌బర్గ్) అని ఆయన ట్వీట్‌ చేశారు. అది ఏ పాటకో నిక్‌ గుర్తు చేస్తే బావుంటుందని పేర్కొన్నారు. ఈ చిత్రంలో మైక్‌ దగ్గర ఉన్నది నిక్‌. నిక్‌కు ఎడమవైపున తనకిష్టమైన బీటిల్‌ బూట్స్‌ ధరించి ఉన్నదే ఆనంద్‌ మహీంద​. అలా తన స్కూల్ బ్యాండ్‌ ఫోటోలను ఫ్యాన్స్‌తో పంచుకోవడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గిటారు వాయిస్తున్న వీడియోను షేర్‌ చేయమని కోరుతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top