
కళా ఉత్సవ్‌తో సృజనాత్మకత వెలికితీత
నారాయణపేట రూరల్: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు, కనుమరుగవుతున్న కళలకు జీవం పోసేందుకు ప్రభుత్వం కళా ఉత్సవ్ నిర్వహిస్తుందని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి విద్యాసాగర్ అన్నారు. మంగళవారం పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష ఆధ్వర్యంలో స్థానిక బాలకేంద్రంలో జిల్లాస్థాయి కళా ఉత్సవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కళాంశాల్లో పాల్గొని ప్రతిభకనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు సంస్కృతి, సంప్రదాయ కళలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. కాగా, వివిధ విభాగాల్లో నిర్వహించిన జిల్లాస్థాయి కళా ఉత్సవ్‌లో చక్కటి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఒకల్ మ్యూజిక్‌లో చంద్రలేఖ (టీజీఎంఎస్‌జేసీ, ధన్వాడ), ఒకల్ మ్యూజి క్ గ్రూప్‌లో పూజ (టీజీడబ్ల్యూఆర్‌ఎస్, ఊట్కూర్), ఇను్టృమెంటల్ మ్యూజిక్ సోలోలో సంజన (టీఎస్‌బ్ల్యూఆర్‌ఎస్ ఊట్కూర్), ఇన్స్‌ట్రుమెంటల్ మ్యూజిక్ గ్రూప్‌లో హిమజ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ ఊట్కూర్), డాన్స్ సోలో క్లాసికల్‌లో చంద్రలేఖ (టీజీఎంఎస్‌జేసీ ధన్వాడ), డాన్స్ గ్రూప్ జానపదంలో మేఘన గ్రూప్ (శ్రీసాయి స్కూల్ నారాయణపేట), థియేటర్ గ్రూప్‌లో సవిత (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌జేసీ), విజువల్ ఆర్ట్స్ టు డీ సోలోలో సావి త్రి (జెడ్పీహెచ్‌ఎస్, పల్లెర్ల), విజువల్ ఆర్ సోలో 3–డీలో నాగవేణి (జెడ్పీహెచ్‌ఎస్, బిజ్వార్), విజువల్ ఆర్ట్స్ గ్రూప్ 3–డీలో కార్తీక (టీజీడబ్ల్యూఆర్‌ఎస్‌జేసీ ఊట్కూర్), ట్రెడిషనల్ స్టోరీ టెల్లింగ్‌లో స్వా తి (పీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ ఊట్కూర్) ఎంపికై నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో బాలకేంద్రం సుపరింటెండెంట్ మహిపాల్‌రెడ్డి, సంగ నర్సింహులు, జ్ఞానామృత, వసంత్ కుమార్, పర్వీన్, శ్రీకాంత్, శ్రీనివాస్, సంతోష్ పాల్గొన్నారు.