
కాళోజీ జీవితం.. స్ఫూర్తిదాయకం
మక్తల్: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మక్తల్‌లోని మంత్రి కార్యాలయంలో ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సమసమాజ నిర్మాణానికి కాళోజీ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా జీవించిన ఆయన.. తెలుగుభాష, ప్రజల అవసరాల కోసం తన జీవితాన్నే త్యాగం చేశారన్నారు. ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. కాళోజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆత్మకూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రహిమతుల్లా, వైస్‌చైర్మన్ గణేశ్‌కుమార్, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటేశ్, సూర్యకుమార్, రవికుమార్, రాజేందర్, గోవర్ధన్, దండు రాము పాల్గొన్నారు.