
నేడు జిల్లాకు మృతదేహాలు..
ఈ ప్రమాదంపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం అయిన తర్వాత మృతదేహాలు ఇవ్వనున్నారు. అయితే అక్కడి నుంచి గురువారం మధ్యాహ్నం గద్వాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయని మృతుడి బంధువులు పేర్కొన్నారు. ఇదిలాఉండగా, తెలుగు భాస్కర్ చిన్ననాటి నుంచి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడని, బంధువుల సాయంతో బీటెక్ పూర్తి చేసి ఎంతో కష్టపడి బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడని బంధువులు, కాలనీవాసులు గుర్తు చేశారు. ఉద్యోగంలో ఒక్కో మెట్టు పైకి ఎక్కి, భార్య, పిల్లలతో సంతోషంగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం కలిచివేస్తుందని.. వారి కుమారుడు ప్రవీణ్ ఆలనా పాలన చూసేది ఎవరంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు.