
మత్తు పదార్థాలనిర్మూలనకు చర్యలు
మాగనూర్(మక్తల్): గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు డీఎస్సీ ఎన్.లింగయ్య తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని పలు ప్రదేశాల్లో నార్కోటిక్స్ స్నైపర్ పోలీసు జాగిలంతో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముఖ్యంగా కిరాణషాపులు, పాన్‌షాప్‌లు, అనుమానంగా ఉన్న పంట పొలాల్లో తనిఖీలు నిర్వహించారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు వినియోగిస్తున్న లేదా రవాణా చేసిన వెంటనే డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌సి బలరాం, నరేందర్ పాల్గొన్నారు.
సమ్మర్ క్యాంపును
సద్వినియోగం చేసుకోవాలి
ధన్వాడ: ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత సమ్మర్ క్యాంపులను యువత, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ గోవిందరాజులు అన్నారు. బుధవారం ధన్వాడ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరాన్ని డీఈఓ తనిఖీ చేశారు. విద్యార్థుల ఆటలను వీక్షించారు. శిక్షణలో పాల్గొన్న వారికి పలు సూచనలు అందజేశారు. కార్యక్రమంలో హెచ్‌ఊం నరసింహచారి తదితరులు పాల్గొన్నారు.
ప్రతి రైతు ఫార్మర్ ఐడీ కలిగి ఉండాలి
ఊట్కూరు: ప్రతి రైతు ఫార్మర్ ఐడి కలిగి ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి జాన్‌సుధాకర్ అన్నారు. బుధవారం ఊట్కూరులోని రైతు వేదికలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధార్‌కార్డుతో దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు ఇచ్చినట్లుగానే ప్రతి రైతుకు ఆధార్ ఐడి కేటాయించడం జరుగుతుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చెయ్యాలనే సంకల్పంతో ఫార్మర్ ఐడీని చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రతి రైతు వ్యవసాయ అధికారులను సంప్రదించి ఫార్మర్ ఐడిని తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి గణేష్‌రెడ్డి, ఏఏఓ చరన్, స్వరూప, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
పిల్లలమర్రిలో ఏర్పాట్లు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ప్రపంచ సుందరి పోటీల్లో భాగంగా ఈనెల 16న జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రిని విదేశీ పర్యాటకుల బృందం సందర్శించనుంది. దీంతో ఈనెల 2 నుంచి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ ప్రాంతం మొత్తం ఎక్కడా చెత్తాచెదారం లేకుండా సుమారు 25 మంది కార్మికులతో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. అలాగే 500 చదరపు గజాల విస్తీర్ణంలో లాన్ (కార్పెట్ గ్రాస్) ఏర్పాటు చేస్తున్నారు. ఆహ్లాకర వాతావరణం ఉట్టిపడేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. వీటిని బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డి పరిశీలించి సిబ్బందికి తగు సూచనలిచ్చారు. మరోవైపు మెట్టుగడ్డ (ఎన్‌హెచ్–167) నుంచి మొదలుకొని పిల్లలమర్రి వరకు గల విశాలమైన రోడ్డుకు ఇరువైపులా మొక్కలను పెంచుతున్నారు. వీటి మధ్య పెరిగిన పిచ్చిమొక్కలను సైతం తొలగిస్తున్నారు.

మత్తు పదార్థాలనిర్మూలనకు చర్యలు

మత్తు పదార్థాలనిర్మూలనకు చర్యలు

మత్తు పదార్థాలనిర్మూలనకు చర్యలు