
నారాయణపేట రూరల్: ఇంటర్ విద్యార్థులకు బుధవారంతో వార్షిక పరీక్షలు పూర్తయ్యాయి. చివరి రోజు కెమిస్ట్రి, కామర్స్ పరీక్షలో జిల్లా వ్యాప్తంగా 3,287 మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను 3,197మంది విద్యార్థులు హాజరయ్యారు. 87మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా 478మంది ఒకేషనల్ విద్యార్థులకు గాను 452మంది పరీక్ష రాశారు. 26మంది అబ్సెంట్ అయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో డీఐఈఓ రియాజ్‌హుస్సేన్, పరీక్షల విభాగం అధికారి సుదర్శన్ కృతజ్ఞతలు తెలిపారు.
మక్తల్‌లో కార్డెన్ సెర్చ్
మక్తల్: పట్టణంలోని కేశవనగర్‌లో బుధవారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈసందర్బంగా డీసీఆర్‌బీ డీఎస్‌పీ వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ నేరాలు కట్టడి చేసేందుకు కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ కాలనీలో పలు వాహనాలకు ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలు లేకపోవడంతో స్టేషన్‌కు తరలించారు. మక్తల్ సీఐ సీతయ్య, మరికల్ సీఐ శ్రీకాంత్‌రెడ్డి, ఎస్‌ఐలు రాములు, పర్వతాలు, నరేందర్, విజయభాస్కర్, విక్రమ్, 60మంది పోలీసులు పాల్గొన్నారు.