
వెంచర్ల లేఅవుట్ పత్రాలు పరిశీలిస్తున్న అడిషనల్ కలెక్టర్ మయాంక్ మిట్టల్
మక్తల్: స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని వెంచర్లను అడిషనల్ కలెక్టర్ మియాంక్ మిట్టల్ మంగళవారం పరిశీలించారు. మొదటగా కాటన్‌మిల్ వద్ద ఉన్న వెంచర్ లేఅవుట్‌లను ఏర్పాటు చేసుకునేందుకు కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా వివాదంలో ఉన్న మరో వెంచర్ ట్రాక్టర్ షో రూం వెనుక ఉన్న వెంచర్లను పరిశీలించారు. రెండు వెంచర్లకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. కొన్ని సక్రమంగా లేకపోవడంతో రికార్డు ప్రకారంగానే అనుమతులు ఇస్తామని అన్నారు. ఆయన వెంట కమిషనర్ మల్లికార్జున్, ఎంపీడీఓ శ్రీధర్, ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు ఉన్నారు.