కంటికి పరీక్షే..! | - | Sakshi
Sakshi News home page

కంటికి పరీక్షే..!

Mar 29 2023 1:14 AM | Updated on Mar 29 2023 1:14 AM

మరికల్‌లో మహిళకు కంటి పరీక్ష చేస్తున్న వైద్యుడు   - Sakshi

మరికల్‌లో మహిళకు కంటి పరీక్ష చేస్తున్న వైద్యుడు

మరికల్‌: జిల్లాలో కంటివెలుగు కార్యక్రమం మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. శిబిరాల్లో వైద్య బృందం కంటి పరీక్షలు మాత్రమే చేసి వదిలేస్తు న్నారు. ఈకార్యక్రమం ప్రారంభించిన తర్వాత నేటి వరకు కూడా శస్త్ర చికిత్సలు చేయడంలేదు. దీంతో దృష్టి లోపం ఉన్నవారు నిరుత్సాహానికి గురవుతున్నారు. అవసరం ఉన్న అందరికీ కళ్లద్దాలు కూడా అందించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పరీక్షలు చేయడానికే శిబిరాలు ఎందుకంటూ పలువురు పెదవి విరుస్తున్నారు.

ఆపరేషన్‌కు హైదరాబాద్‌కి రెఫర్‌!

జిల్లాలో జనవరి 18 నుంచి రెండోవిడత కంటివెలుగు కార్యక్ర మం ప్రారంభించారు. మొత్తం 24 శిబిరాలను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ సెలవు రోజులు శని, ఆదివారం మినహా అన్ని పనిదినాల్లో కంటి వెలుగు కార్యక్రమం కొనసాగిస్తున్నారు. శిబిరాల్లో దగ్గరిచూపు సమస్య ఉన్నవారికి వెంటనే అద్దాలు పంపిణీ చేస్తున్నారు. దూరపుచూపు బాధితుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఒక్కో శిబిరంలో రోజుకు 120 నుంచి 150 మందికి పరీక్షలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1,21,658 మందికి కంటి పరీక్షలు చేశారు. దూరపుచూపులో లోపం ఉన్నవారికి అందించేందుకు కళ్లద్దాల కోసం ఆన్‌లైన్‌లో సిపార్సు చేశారు. కాగా పరీక్షల అనంతరం దృష్టిలోపం ఉన్న ఒక్కరికి కూడా శస్త్రచికిత్స చేయలేదు. కళ్లకు పొర వచ్చి దృష్టిలోపం ఉన్నవారికి కంటివెలుగు కార్డు ఇచ్చి హైదరాబాద్‌లోని సరోజినీ కంటి ఆస్పత్రికి వెళ్లాలని సూచించి, చేతులు దులుపుకుంటున్నారు.

సొంత డబ్బుతోఆపరేషన్‌ చేయించుకున్నా..

కంటి వెలుగు శిబిరంలో రెండు కళ్లను చూపించుకున్నాను. ఒక కంటికి ఆపరేషన్‌ చేసుకోవాలని డాక్టర్లు చెప్పారు. కంటివెలుగు పూర్తయిన తర్వాతనే ఆపరేషన్లు చేస్తామని చెప్పడంతో సొంత డబ్బుతో హైదరాబాద్‌లోని కంటి ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నాను. దృష్టి లోపం ఉందని అద్దాలు ఇస్తామన్నారు. కానీ ఇంతవరకు అద్దాలు కూడా ఇవ్వలేదు.

– మల్లప్ప, మరికల్‌

కళ్లద్దాలు ఇవ్వలేదు..

కంటి పరీక్షలు చేయించుకున్న తర్వాత దూరంచూపు సక్రమంగా కనిపించడం లేదన్నారు. ప్రస్తుతానికి మందులు ఇచ్చి 15రోజుల అనంతరం అద్దాలు ఇస్తామన్నారు. ఇంతవరకు అద్దాలు ఇవ్వలేదు. దీంతో ప్రైవేట్‌ ఆస్పత్రిల్లో మళ్లీ కంటి పరీక్షలను చేయించుకొని అద్దాలు తెచ్చుకున్నాను. – మల్లేష్‌, మరికల్‌

కంటి ఆపరేషన్‌ అప్పుడే..

జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత జిల్లా కేంద్రంలోనే క్యాంపులు ఏర్పాటు చేసి, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేస్తాం. అంతవరకు కంటిపరీక్షలే చేస్తారు. ఇందులో అవసరం ఉన్నవారికి అద్దాలు పంపిణీ చేస్తున్నాం. ప్రస్తుతం ఎవరికి శస్త్ర చికిత్సలు చేయడం లేదు.

– రాంమనోహర్‌ రావు, డీఎంహెచ్‌ఓ

ఊసేలేనిశస్త్ర చికిత్సలు

‘కంటివెలుగు’లోపరీక్షలు మాత్రమే చేసి వదిలేస్తున్న వైనం

మొక్కుబడిగా రెండో విడత కార్యక్రమం

1
1/3

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement