
మాట్లాడుతున్న కృష్ణయాదవ్
నారాయణపేట టౌన్: కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే దేశ జనాభా గణనలో బీసీ ఉప కులాల గణన చేపట్టాలని, జనాభా దమాషా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని బీసీసేన రాష్ట్ర అధ్యక్షుడు బూరుగుపల్లి కృష్ణయాదవ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్‌లో నిర్వహించిన ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు విద్య, ఉద్యోగ, ఆర్థిక, ఉపాధి, రాజకీయ రంగాల్లో సమాన వాటా కల్పించాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, అన్ని పార్టీలు జనాభా దామాషా ప్రకారం బీసీలకు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీసేన రాష్ట్ర కార్యదర్శి జెవి రావు, జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి మహేష్, నాయకులు వెంకటేష్‌యాదవ్, లక్ష న్న, గోపాల్, రాజు, అజయ్, బాలు పాల్గొన్నారు.