
సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్ శ్రీహర్ష, ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి
మద్దూరు: కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో వెలసిన శ్రీ గురులోకామాసంద్ ప్రభు (భావాజీ) ఉత్సవాల్లో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా చూడాలని అన్నిశాఖల అధికారులకు కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. సోమవారం తిమ్మారెడ్డిపల్లిలోని గురులోకామాసంద్ ప్రభు(బావాజీ) దేవాలయం ఆవరణలో ఏప్రిల్ 5 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే జాతర ఉత్సవాలకు లక్షలా ది మంది వచ్చే గిరిజన భక్తుల కోసం ఆయాశాఖల అధికారులతో కలెక్టర్, ఎమ్మెల్యే కలిసి సమీక్ష నిర్వహించారు. వెంటనే ఎక్కమేడ్ నుంచి తిమ్మారెడ్డిపల్లి రావడానికి వేసిన రోడ్డును వెడల్పు చేసి, అక్కడి నుంచి ఆలయం వరకు లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, మూత్రశాలలు, సాన్నాల గదులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. పోలీసులు ఇక్కడే కంట్రోల్ రూం ఏర్పాటుతో పాటు, రథోత్సవం సందర్బంగా చేపట్టే చర్యల గురించి పోలీసులతో తెలుసుకున్నారు. రవాణా, వైద్యం, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఎకై ్సజ్, అగ్నిమాపక, తదితర శాఖలపై సమీక్ష నిర్వహించా రు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ, డీఎంహెచ్‌ఓ రాంమోహన్‌రావ్, డీపీఓ మురళి, డీఎస్‌పీ వెంకటేశ్వర్లు, కోస్గి సీఐ జనార్దన్, ఎంపీడీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ రాణాప్రతాప్‌సింగ్, ఆలయ ఈఓ కోమల్, ఆలయ కమిటీ సభ్యులు, ఆయాశాఖల అధికారు లు, టీఆర్‌ఎస్ నాయకులు సలీం, బాల్‌సింగ్‌నాయక్, వెంకటయ్య, హన్మిరెడ్డి పాల్గొన్నారు.