
నారాయణపేట: అధిక డబ్బులు వెచ్చించకుండా ఆన్‌లైన్‌లో (మన ఇసుక– మన వాహనం) ఇసుకను బుక్ చేసుకుంటే నేరుగా తమ ఇంటికి ఇసుకను ప్రభుత్వం సరఫరా చేస్తుందని కలెక్టర్ శ్రీహర్ష ప్రజలకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాలులో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో కలెక్టర్ స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. ఇళ్ల నిర్మాణ సమయంలో అవసరమైన మొరం సైతం ప్రభుత్వం ద్వారా అతి తక్కువ ధరకే సరఫరా చేసుకోవచ్చని తెలిపారు. ఈఅవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పటికే చాలామంది సమస్యలను తన దృష్టికి తెచ్చారని అన్నారు. తన పరిధిలో ఉన్న వాటిని వెంటనే పరిష్కరిస్తానని అన్నారు. ప్రజావాణిలో కలెక్టరేట్ ఏఓ నర్సింగ్‌రావు, పీఎస్ నాగేందర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పోలీసు గ్రీవెన్స్‌కు9 ఫిర్యాదులు
నారాయణపేట రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 9 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారులతో ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం అర్జీలను స్వీకరించారు. సంబంధిత ఎస్‌ఐలకు బదిలీ చేసి వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అత్యవసర సమయంలో డయల్ 100, 112లను సంప్రదించాలని అర్జీదారులకు సూచించారు.
బోదకాల నిర్మూలనకుకృషి చేద్దాం
నారాయణపేట రూరల్: బోదకాలు వ్యాధిని వందశాతం నిర్మూలించడానికి వైద్య బృందం కృషి చేస్తోందని ఆ శాఖ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ తుకారాం భట్ అన్నారు. జిల్లా కేంద్రంలో డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ట్రాన్స్‌మిషన్ అసిస్మెంట్ సర్జరీ (టాస్)–3 శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ జిల్లాలోని విద్యాసంస్థల్లో ర్యాండమ్‌గా ఎంపిక చేయబడిన పాఠశాలల్లోని 1, 2వ తరగతి చదువుతున్న చిన్నారుల నుంచి వైద్య సిబ్బంది రక్త నమూనాలు సేకరిస్తారని, అందులో ఫిలారియా వ్యాధి లక్షణాలను గుర్తిస్తారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా పది బృందాలు ఈ పరీక్షలు చేస్తాయని, వీటిలో ల్యాబ్‌టెక్నీషియన్, సూపర్‌వైజర్, హెల్త్ అసిస్టెంట్, ఏఎన్‌ఎం, డాక్టర్ ఉంటారని చెప్పారు. మంగళవారం నుంచి ప్రారంభమై ఏప్రిల్ 3 వరకు కొనసాగుతుందని, జిల్లాలో మొత్తం 47 స్కూల్‌లలో 1898 మందికి పరీక్షలు చేయాలని లక్ష్యం నిర్ధేశించినట్లు తెలిపా రు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌ఓ రాంమనోహర్‌రావు, డబ్ల్యూహెచ్‌ఓ కన్సల్టెంట్ విజయ్‌కుమార్, ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ బాలాజిరావు, సబ్‌యూనిట్ అధికారి అశోక్, అహ్మద్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

