
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
మరికల్: తెలంగాణ సాధించుకున్న తర్వాత జిల్లాలో వందరెట్ల అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మరికల్ మండల బీఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పార్టీని రాబోవు ఎన్నికల్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఇందుకు నాయకులు, కార్యకర్తలు చేయాల్సిన బాధ్యతలపై పార్టీ ముఖ్యనాయకులతో మాట్లాడించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో గ్రూపు తగాదాలను పక్కనబెట్టి 9ఏళ్ల పాలనలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని రాబోవు ఎన్నికల్లో ఇంటింటికీ తీసుకెళ్లాలన్నారు. జిల్లాకు రైతుబంధు సాయం ఏడాదికి రూ.2,800 కోట్లు ఇస్తోందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు చేస్తున్న ఆరోపణలను ప్రజల నమ్మడం లేదన్నారు. రాబోవు ఎన్నికల్లో ఢిల్లీ కోటపై బీఆర్‌ఎస్ జెండాను ఎగరవేయాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. అనంతరం పూసల్‌పహాడ్ ఉపసర్పంచ్ ఆంజనేయులు, మరికల్‌కు చెందిన కొందరు ఇతర పార్టీ నాయకులు, కుల సంఘాల వారు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ వనజమ్మ, వైస్ చైర్మన్ సురేఖ, ఎంపీపీ శ్రీకళ, మండల అధ్యక్షుడు తిరుపతయ్య, రాజవర్ధన్‌రెడ్డి, సంపత్, బసంత్, రామస్వామి, కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బాలకిష్ణ, మండలంలోని నాయకులు పాల్గొన్నారు.
మన్యకొండలో రోప్ వే నిర్మాణ స్థలపరిశీలన
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానం వద్ద నిర్మించనున్న రోప్ వే స్థలాన్ని టూరిజం ఎండీ మనోహర్ ఆదివారం పరిశీలించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశాల మేరకు రోప్ వే, కల్యాణ మండపం, లడ్డూ ప్రసాదం కౌంటర్‌ల నిర్మాణానికి సంబంధించి స్థలాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్ తదితరులున్నారు.