● భార్యపై భర్త దాడి
బొమ్మలసత్రం: అత్తమామలు ఏసీ కొనివ్వలేదని ఓ వ్యక్తి భార్యను చితకబాదిన ఘటన శుక్రవారం నంద్యాల పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. అన్నమయ్య జిల్లా గాలివీడుకు చెందిన సల్మాను పట్టణంలోని టీచర్స్ కాలనీలో నివాసముంటున్న షేక్ మహమ్మద్‌రఫికి ఇచ్చి రెండేళ్ల క్రితం వివాహం జరిపించారు. ఇతను స్థానిక చోలమండల్ ఫైనాన్స్‌లో రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. వేసవిలో ఉక్కపోత ఉందని, ఏసీ ఇప్పించాలని సల్మా తల్లిదండ్రులకు ఫోన్‌చేసి హుకుం జారీ చేశాడు. తమ వద్ద అంత డబ్బు లేదని వారు చెప్పడంతో మహమ్మద్‌రఫి బెల్టు, గరిటలతో సల్మాపై దాడి చేశాడు. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో బంధువులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మహమ్మద్‌రఫిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.