
గరంథాలయాలకు నిధులు సమకూర్చుకోవాలి
రామగిరి(నల్లగొండ) : జిల్లా కేంద్ర గ్రంథాలయంతోపాటు నాగార్జునసాగర్, చందంపేట, మునుగోడు, దేవరకొండ ఇతర గ్రంథాలయ నిర్వహణకు నిధులు సమకూర్చుకోవాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎంఏ హఫీజ్ ఖాన్ అన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సోమవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. కలెక్టర్ అనుమతితో పాత టౌన్ హాల్ స్థలంలో జిల్లా గ్రంథాలయ సంస్థ భవనాన్ని నిర్మించాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. జిల్లా గ్రంథాలయంతోపాటు ఇతర గ్రంథాలయాల్లో పనిచేస్తున్న స్వీపర్ల చార్జీలు 25 శాతం పెంచాలని తీర్మానించారు.
10న సురవరం సంస్మరణ సభ
నల్లగొండ టౌన్ : సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి, నల్లగొండ మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభను ఈ నెల 10వ తేదీన పట్టణంలోని దేవరకొండ రోడ్డులో గల జీఎల్ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంస్మరణ సభకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కుందూరు రఘువీర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ప్రెస్ అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి, సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి హాజరవుతారని తెలిపారు. సభకు అన్ని వర్గాల ప్రజలు హజరై విజయవంతం చేయాలని కోరారు.
పార్టీల ప్రతినిధులతో జెడ్పీ సీఈఓ సమావేశం
నల్లగొండ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటరు, పోలింగ్ స్టేషన్ల జాబితాపై అభిప్రాయాల సేకరణ నిమిత్తం సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. జాబితాలపై అభ్యంతరాలు స్వీకరించారు. ఓటరు జాబితాలో మార్పు చేర్పులు చేసే అధికారం తమకు లేదని సంబంధిత ఆర్డీఓలు ఈఆర్వోల ద్వారా చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతూ 353 ఎంపీటీసీలకు సంబంధించిన పూర్తి వివరాలను ముందుగానే తమకు ఇవ్వాలని, ఏ బూత్ ఏ గ్రామంలోకి వస్తుందో జాబితా ఇవ్వాలని విన్నవించారు. సమావేశంలో నాయకులు గుమ్మల మోహన్‌రెడ్డి, లింగస్వామి, పి.మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
ట్రిపుల్‌ఆర్ బాధితులకు అండగా నిలుస్తాం
మునుగోడు : ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న ట్రిపుల్ ఆర్‌లో భూములు కోల్పోపొతున్న రైతులకు తాము అండగా నిలిచి పోరాడుతామని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సోమవారం మునుగోడు సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్రిపుల్ ఆర్ రోడ్డు కోసం దక్షిణ భాగంలో భూ సేకరణలో అధికారులు చౌటుప్పల్‌లోని దివిస్ కంపెనీని కాపాడేందుకు అలైన్‌మెంట్‌లో మార్పు చేశారని ఆరోపించారు. దానివల్ల అనేక మంది పేదల భూములు కోల్పోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ట్రిపుల్ ఆర్‌లో భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ ధర కంటే అదనంగా 10 రెట్ల పరిహారం అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. సమావేశంలో నాయకులు గుర్జ రామచంద్రం, చాపల శ్రీను, బి.లాలు, రమేష్, దుబ్బ వెంకన్న, ఈదులకంటి కై లాస్, పాండు, వెంకన్న, సత్తమ్మ, దయాకర్, శంకర్, ముత్తయ్య పాల్గొన్నారు.

గరంథాలయాలకు నిధులు సమకూర్చుకోవాలి

గరంథాలయాలకు నిధులు సమకూర్చుకోవాలి