
శుభాన్షు శుక్లాకు సెల్యూట్
చిట్యాల: అంతరిక్షంలోకి అడుగుపెట్టిన రెండవ భారతీయుడుగా రికార్డు సృష్టించిన శుభాన్షు శుక్లాకు గురువారం చిట్యాలలోని ఆక్స్‌ఫోర్ట్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు భారీ జాతీయ పతాకం చేతపూని సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పెద్ది నరేందర్ మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన శుభాన్షు శుక్లా నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ఉపాధ్యాయులు నర్రా భిక్షంరెడ్డి, నమ్ముల ఆనంద్‌కుమార్, షేక్ షెమీమున్సిసా బేగం, పుల్లెంల సంతు, గణేష్, జ్యోతి, ధనలక్ష్మి, ఆసియా, మాధవి, మౌనిక, కీర్తి, లింగస్వామి పాల్గొన్నారు.