
క్రీడా పాఠశాలల్లో ప్రవేశంతో ఉజ్వల భవిష్యత్
నల్లగొండ టూటౌన్ : క్రీడా పాఠశాలల్లో ప్రవేశం పొందితే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ క్రీడా పాఠశాలలో ప్రవేశానికి మంగళవారం నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుందని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో రాణించడం ద్వారా ఎంతో పేరు వస్తుందన్నారు. ఇక్కడ ప్రతిభ కనభర్చిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్డీఓ అక్బర్ అలీ, పీడీలు కుంభం నర్సిరెడ్డి, విమల, కవిత, నజీర్ పాల్గొన్నారు.