
స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకోవాలి
నల్లగొండ టూటౌన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కోరారు. శనివారం నల్లగొండలోని వీటీ కాలనీలో ఉన్న క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి ఎంతో ముఖ్యమైనవని, అత్యధిక స్థానాలు కై వసం చేసుకునే దిశగా పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కటికం సత్తయ్యగౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, చీర పంకజ్‌యాదవ్, నల్లగొండ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, పార్టీ ఆయా మండలాల అధ్యక్షులు పల్రెడ్డి రవీందర్‌రెడ్డి, ఐయితగాని యాదయ్య, దేప వెంకట్‌రెడ్డి వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్ పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి