
పుణ్య క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
రామగిరి(నల్లగొండ) : ప్రముఖ పుణ్య క్షేత్రాలకు ఈ నెల 26, 27వ తేదీల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని రీజినల్ మేనేజర్ కె.జానిరెడ్డి తెలిపారు. నల్లగొండలో శనివారం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని డిపోల నుంచి యాత్రీకుల కొరకు డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బుకింగ్ కోసం నల్లగొండ : 9160360707, దేవరకొండ : 7382833031, మిర్యాలగూడ : 9298008888, సూర్యాపేట : 7382836177, కోదాడ : 7780433533, యాదగిరిగుట్ట : 9885103165 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
డిపోల వారీగా బస్సుల వివరాలు...
ఫ నల్లగొండ నుంచి అలంపూర్, బాచుపల్లి, శ్రీరంగపూర్, జటాప్రోలు, సోమశిల, కొల్లాపూర్, సింగోటం.
ఫ దేవరకొండ నుంచి పంచదేవపహాడ్, మక్తల్, మన్యంకొండ, కురుమర్తి, గంగాపూరం, ఊర్కొండపేట, గుల్బర్గా (ఖజా గరీబ్ నవాబ్ దర్గా), హాల్‌కట్ట (షరీఫ్ దర్గా).
ఫ మిర్యాలగూడ నుంచి ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, కొమురెల్లి.
ఫ సూర్యాపేట నుంచి అన్నవరం, ద్రాక్షారామం, అంతర్వేది, పెనుగొండ, ద్వారకా తిరుమల.
ఫ కోదాడ నుంచి అలంపూర్, బాచుపల్లి, శ్రీరంగపూర్, జటాప్రోలు, సోమశిల, కొల్లాపూర్, సింగోటం.
ఫ యాదగిరిగుట్ట నుంచి కొండపోచమ్మ, వరంగల్, కొండగట్టు, వేములవాడ, సిద్దులగుట్ట.