ప్రత్యేక టైం టేబుల్‌.. | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక టైం టేబుల్‌..

Jun 22 2025 3:18 AM | Updated on Jun 22 2025 3:18 AM

ప్రత్యేక టైం టేబుల్‌..

ప్రత్యేక టైం టేబుల్‌..

క్రమశిక్షణతో కూడిన విద్యను అందించే ఈ గురుకుల కళాశాలలో ప్రత్యేక టైం టేబుల్‌ను అమలు పరుస్తారు. ఉదయం 5 గంటలకే వీరి దినచర్య ప్రారంభిస్తారు. 6 నుంచి 7 గంటల వరకు వ్యాయామంతో కూడిన ఫిజికల్‌ యాక్టివిటీ ఉంటుంది. 7 గంటలకు బ్రేక్‌ఫాస్ట్‌ ఇస్తారు. 8 నుంచి 8.45 గంటల వరకు నిన్న జరిగిన అంశాలపై సమీక్ష ఉంటుంది. 8.45 నుంచి 9 గంటల వరకు ప్రార్థన, 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.20 వరకు తరగతులు నిర్వహిస్తారు. 2.20 వరకు భోజన విరామం ఉంటుంది. 2.20 నుంచి 5.30 వరకు సివిల్స్‌కు సంబంధించిన అంశాలపై శిక్షణ ఇస్తారు. దీనిలో వీరికి ఆంగ్ల భాషపై ప్రావీణ్యంతో పాటు రీజనింగ్‌ ఇతర అంశాలను నేర్పిస్తారు. ఆ తరువాత అల్పాహారం ఇచ్చి సాయంత్రం 6.30 గంటల వరకు క్రీడల్లో శిక్షణ ఇస్తారు. 6.30 నుంచి 7.30 మధ్య ర్రాతి భోజన సమయం ఉంటుంది. ఆ తరువాత 9.30 అకడమిక్‌ స్టడీ అవర్స్‌, 9.30 నుంచి 10.30 డిఫెన్స్‌ స్టడీ అవర్స్‌ నిర్వహిస్తారు. డిఫెన్స్‌ అంశాలపై వారానికి ఒకసారి టెస్ట్‌ నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement