
మినీ శిల్పారామంలో నృత్య ప్రదర్శన
భువనగిరి: భువనగిరి మండలం రాయగిరి గ్రామ పరిధిలోని పెద్ద చెరువు వద్ద గల మినీ శిల్పారామంలో శనివారం ప్రత్యేక ఆఫీసర్ కిషన్‌రావు ఆధ్వర్యంలో చిన్నారులచే నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. సందర్శకులు నృత్య ప్రదర్శనను తిలకించి ఆనందించారు.
జలనారాయణస్వామికి మంగళహారతులు
భువనగిరి: భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శనివారం రాత్రి జలనారాయణస్వామికి మంగళహారతుల కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. అంతకుముందు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన సేవ, నిత్య కల్యాణం, మధ్యాహ్నం సుమారు 4వేల మందికి అన్నప్రసాద వితరణ, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

మినీ శిల్పారామంలో నృత్య ప్రదర్శన