
మోదీ తల్లిపై రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు సరికాదు
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం
ములుగు రూరల్: ప్రధాని నరేంద్రమోదీ తల్లిపై రాహుల్‌గాంధీ అనుచిత వ్యాఖ్యలు సరికాదని, రాహుల్ గాంధీని అరెస్టు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం డిమాండ్ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిపై రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ మాటలు దేశ మహిళలు, ప్రజలను కించపరిచే విధంగా ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ దేశ ప్రజలకు క్షమాపన చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ భూక్య జవహార్‌లాల్, ఉపాధ్యక్షుడు కృష్ణాకర్, అల్లె శోభన్, రవీంద్రాచారి, నగరపు రమేష్, రాజ్‌కుమార్, లవణ్‌కుమార్, ఇమ్మడి రాకేష్‌యాదవ్, రవిరెడ్డి, నాగరాజు, హరిబాబు, సంపత్, సుమలత, పవన్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.