
ఆదర్శ పాఠశాల
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ఉపాధ్యాయులు
ఏటూరునాగారం: ప్రభుత్వ పాఠశాల అనగానే గతంలో కొంతమేర చిన్నచూపు ఉండేది.. కానీ రానురాను కొన్ని ప్రభుత్వ పాఠశాలలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల(నార్త్)ను ఉపాధ్యాయులు ఆదర్శంగా తీర్చిదిద్దారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులను ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉంటాము అన్నట్లుగా తీర్చిదిద్దారు.. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర్ బడికి ఏ విద్యార్థి రాకున్నా ఇంటికి వెళ్లి బండిమీద ఎక్కించుకొని బడిలో దింపుతాడు. ఇలా ఒకటి నుంచి 5వ తరగతి వరకు బడీడు పిల్లలను బడిలో తప్ప బయట ఎక్కడ కూడా కనిపించకుండా చేశారు.
వారం వారం క్విజ్ పోటీలు
మండల కేంద్రంలోని ప్రభుత్వ నార్త్ ప్రాథమిక పాఠశాలలో పిల్లల మేధాశక్తి పెంచడానికి ప్రతీ వారం పాఠశాలలో క్విజ్ కార్యక్రమాలు, స్పెల్ బి పోటీలు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రతిభను వెలికి తీస్తున్నారు. దానివల్ల వారిలో ఉన్న మేధాశక్తి పెంచడంతో పాటు చురుకుదనం, స్టేజ్ ఫియర్ పొయే అవకాశాలు ఉన్నాయి.
పాఠశాలలో చేరిన
ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు
ఒకే రోజు 16మందికి అడ్మిషన్లు

ఆదర్శ పాఠశాల