
కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ
ములుగు: జిల్లా కేంద్రంలో ఆదివారం లంబాడ ఐక్య వేదిక ఆధ్వర్యంలో భారత్, పాకిస్థాన్‌కు జరి గిన యుద్ధంలో వీరమరణం పొందిన మూడవత్ మురళీనాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మా ట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మురళీనాయక్ గురువారం అర్ధరాత్రి కశ్మీర్ సరిహద్దుల్లో దేశ రక్షణలో భాగంగా శత్రువులతో వీరోచితంగా పోరాడి ఐదుగురు శత్రు సైనికులను హతమార్చి వీరమరణం పొందిన తొలి జవాన్ అన్నారు. మురళీనా యక్ కుటుంబాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు. అనంతరం మురళీనాయక్ ఆ త్మకు శాంతి చేకూరాలని కోరుతూ మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో పోరిక గోవింద్ నాయక్, జరుపుల బాలునాయక్, పోరిక రాహుల్, కుమార్ పాడ్యా, భూక్యా జంపన్న, హట్కర్ సమ్మయ్య, శంకర్, దేవ్‌సింగ్, సోమ, వినాయక్ పాల్గొన్నారు.