సంగీతంలో ప్రణీత్‌కుమార్‌ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు | - | Sakshi
Sakshi News home page

సంగీతంలో ప్రణీత్‌కుమార్‌ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు

Apr 16 2025 11:22 AM | Updated on Apr 16 2025 11:22 AM

సంగీతంలో ప్రణీత్‌కుమార్‌ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు

సంగీతంలో ప్రణీత్‌కుమార్‌ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు

ఏటూరునాగారం: మండల పరిధిలోని కొండాయి పీహెచ్‌సీలో వైద్యాధికారిగా పనిచేస్తున్న ప్రణీత్‌కుమార్‌ వైద్య వృత్తిని కొనసాగిస్తూనే సంగీతంలో పట్టు సాధించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును సాధించాడు. ఆయన సంగీత పోటీల్లో కీబోర్డ్‌ ప్లే చేయడంలో ప్రతిభ చూపి రికార్డు సాధించారు. డిసెంబర్‌ 1న హలేల్‌ మ్యూజిక్‌ నిర్వహించిన స్కూల్‌ ఆన్‌లైన్‌ సంగీత పోటీల్లో ప్రణీత్‌ కుమార్‌ పాల్గొన్నారు. ప్రపంచ స్థాయిలో జరిగిన ఈ మ్యూజిక్‌ ప్రదర్శనలో అతను గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో స్థానం సంపాధించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధి ఆనంద్‌ రాజేంద్రన్‌ చేతుల మీదగా సర్టిఫికెట్‌, గోల్డ్‌ మెడల్‌ అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement