
నాగర్ ఫిలిమ్స్ పతాకంపై టి.ఆర్ రమేష్, ఎస్ జహీర్ హుస్సేన్ కలిసి నిర్మింన చిత్రం 'కడమై సెయ్'. ఎస్‌జే సర్య, యాషిక ఆనంద్ జంటగా నటించిన ఈ త్రానికి వెంకట్ రాఘవన్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 12న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది ఈ చిత్రం.
Yashika Anand About Working With SJ Surya In Kadamaiyai Sei: నాగర్ ఫిలిమ్స్ పతాకంపై టి.ఆర్ రమేష్, ఎస్ జహీర్ హుస్సేన్ కలిసి నిర్మింన చిత్రం 'కడమై సెయ్'. ఎస్‌జే సర్య, యాషిక ఆనంద్ జంటగా నటించిన ఈ త్రానికి వెంకట్ రాఘవన్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 12న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది ఈ చిత్రం. ఈ సందర్భంగా ఆదివారం (ఆగస్టు 07) సాయంత్రం స్థానిక వడపళనిలోని కమలా థియేటర్లో చిత్ర యూత్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సమావేశంలో నటి యాషిక ఆనంద్ మాట్లాడుతూ.. ''దర్శకుడు కథ చెప్పినప్పుడు అందులోని హీరోయిన్ పాత్రకు నేను న్యాయం చేయగలనా..? అని సందేహం కలిగింది. ఎందుకంటే ఈ చిత్రంలో నటిస్తున్నప్పుడు నా వయస్సు 21. అలాంటిది ఇందులో ఓ బిడ్డకు తల్లిగా నటించే పాత్ర నాది. అప్పటికే నాకు గ్లామర్ డాల్ అనే ముద్ర ఉంది. దాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఇక ఈ చిత్రంలో నటనకు అవకాశం ఉన్న పాత్ర దక్కడం సంతోషంగా ఉంది. ఎస్‌జే సూర్యతో కలిసి నటించడం మంచి అనుభవం'' అని పేర్కొంది.
నటుడు ఎస్ జే సూర్య మాట్లాడుతూ చిత్ర నిర్మాత రమేష్ చాలా ప్రతిభ కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ఇది ఆయన శ్రమతోనే రూపొందిన చిత్రమని పేర్కొన్నారు. మరో నిర్మాత జాకీర్ హుస్సేన్ ఆయనకు పక్క బలంగా నిలిచారన్నారు. దర్శకుడు వెంకట్ రాఘవన్ చిత్ర కథను తనకు చెప్పినప్పుడు అందులో కంటెంట్ చాలా ముఖ్యంగా అనిపించిందన్నారు. ఈ చిత్రకథ ప్రత్యేకంగా అనిపించడంతో కచ్చితంగా నటించాలని భావించానన్నారు. 'కడమై సెయ్' చిత్రం మం విజయం సాధిస్తుందని, కచ్చితంగా ఇది హిందీలోను రీమేక్ అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.