వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా బరి నుంచి పోస్టర్ వీడియోను విడుదల చేశారు. దర్శకుడు యదు వంశీ తెరకెక్కిస్తున్న ఈ మూవీని నిహారిక కొణిదెల తన బ్యానర్ 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్'పై నిర్మిస్తున్నారు. నేడు పూజా కార్యక్రమంతో మొదలైన ఈ మూవీ నుంచి తాజాగా ‘ది వరల్డ్ ఆఫ్ బరి’ (The World Of Bhari) పేరుతో పవర్‌ఫుల్ వీడియోను పంచుకున్నారు. 2027 సంక్రాంతికి పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు.


