
నా ఫ్యాన్స్ ప్రేమాభిమానాలే నా బలం.. కాబట్టి దీన్ని తప్పకుండా షేర్ చేసుకోవాల్సిందే. సోషల్ మీడియాలో ఇదే నా ఆఖరి పోస్ట్..
యంగ్ హీరోయిన్ వరీనా హుస్సేన్ సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్లపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నానని వెల్లడించింది. దీంతో కొద్ది రోజుల పాటు తాను సోషల్ మీడియాలో కనిపించను అంటూ ప్రకటించింది. "నిజానికి ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని విన్నాను. కానీ నా ఫ్యాన్స్ ప్రేమాభిమానాలే నా బలం.. కాబట్టి దీన్ని తప్పకుండా షేర్ చేసుకోవాల్సిందే. సోషల్ మీడియాలో ఇదే నా ఆఖరి పోస్ట్.. ఇక మీదట నా సినిమా అప్‌డేట్‌లను టీమ్ దగ్గరుండి చూసుకుంటుంది. వారే అన్ని ఖాతాలను డీల్ చేస్తారు" అని రాసుకొచ్చింది.
సడన్‌గా సోషల్ మీడియాకు బై చెప్పడంతో వరీనా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకు వెళ్లిపోతున్నారు?, మీరు లేకుండా ఆన్‌లైన్‌లో ఎలా ఉండగలుగుతాం? అంటూ ఎమోషనల్ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇటీవల మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ కూడా సోషల్ మీడియా నుంచి తాత్కాలికంగా తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా వరీనా కూడా ఇదే బాటలో నడవడం చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా వుంటే వరీనా.. సల్మాన్ ఖాన్ 'దబాంగ్ 3' సినిమాలో ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. ప్రస్తుతం ఆమె 'పోస్టర్', 'ఇన్‌కంప్లీట్ మ్యాన్' సినిమాల్లో నటిస్తోంది. కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాలోనూ వరీనా ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.