
విశ్వజిత్, అర్చనా సింగ్, ఊర్వశీ రాయ్, రఘు దీప్ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘కౌశిక్ వర్మ దమయంతి’. వియాన్ జీ అంగారిక సమర్పణలో సుధీర్ దర్శకత్వంలో విశ్వజిత్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్‌లో విడుదల కానుంది. ఈ చిత్రంలోని హేమచంద్ర పాడిన ‘పదరా పదరా వేటకు వెళ్దాం..’ పాటను నిర్మాత సి. కల్యాణ్ విడుదల చేశారు.
చిత్ర హీరో, నిర్మాత విశ్వజిత్ మాట్లాడుతూ– ‘‘రెండొందల సంవత్సరాల క్రితం నాటి కథ, ప్రస్తుత కథతో తెరకెక్కింన ఈ సినిమా ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఇలాంటి మంచి హిస్టరికల్ సినిమాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన హీరో, నిర్మాత విశ్వజిత్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు సుధీర్.