Vijay Deverakonda Rashmika Mandanna Spotted At Mumbai Airport - Sakshi
Sakshi News home page

Vijay Deverakonda Rashmika : మాల్దీవులకు చెక్కేసిన విజయ్‌, రష్మిక? ఫోటోలు వైరల్‌

Oct 7 2022 1:41 PM | Updated on Oct 7 2022 2:55 PM

Vijay Deverakonda Rashmika Mandanna Spotted At Mumbai Airport - Sakshi

విజయ్‌ దేవరకొండ-రష్మిల డేటింగ్‌లో ఉన్నట్లు చాలకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై ఇప్పటికే ఈ జంట క్లారిటీ ఇచ్చినా డేటింగ్‌ రూమర్స్‌ ఆగడం లేదు. తాజాగా విజయ్‌, రష్మిక ఒకేసారి ఎయిర్‌పోర్టులో దర్శనం ఇవ్వడంతో మరోసారి ఈ జంట లవ్‌టాపిక్‌ హాట్‌టాపిక్‌గా మారింది. అంతేకాకుండా ఇద్దరూ ఒకే కలర్‌ డ్రెస్‌లో కనిపించడం మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది.

దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఎయిర్‌పోర్టుకు విజయ్‌ వచ్చిన కాసేపటికే రష్మిక కూడా నవ్వుతూ లోపలికి వెళ్లింది. దీంతో ఇద్దరూ కలిసే వెకేషన్‌ కోసం మాల్దీవులకు వెళ్లినట్లు టాక్‌ వినిపిస్తుంది. కాగా గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించిన విజయ్‌-రష్మికల కెమిస్ట్రీకి ఎంతో మంది అభిమానులున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement