Thalapathy66: Vijay, Rashmika Mandanna Starrer Begins With a Formal Puja Ceremony in Chennai - Sakshi
Sakshi News home page

Vijay: చెన్నైలో గ్రాండ్‌ లాంచ్‌ అయిన విజయ్‌-రష్మిక మూవీ

Apr 6 2022 2:08 PM | Updated on Apr 6 2022 3:38 PM

Vijay 66: Vijay, Rashmika Mandanna Movie Starts With Pooja in Chennai - Sakshi

Vijay, Rashmika Mandanna Movie Starts In Chennai: తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ఓ ద్విభాషా చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. విజయ్‌ నేరుగా చేస్తున్న తొలి తెలుగు చిత్రం ఇది. ఇదివరకు దీనిపై ప్రకటన రాగా తాజాగా ఈ మూవీ చెన్నైలో గ్రాండ్‌గా ప్రారంభమైంది. విజయ్‌ 66వ చిత్రంగా తెరకెక్కే ఈ సినిమా బుధవారం ఉదయం పూజ కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌ రాజు హీరోహీరోయిన్ల తొలి సన్నివేశానికి క్లాప్‌ కొట్టారు.

చదవండి: హైదరాబాద్‌ పబ్‌ డ్రగ్స్‌ కేసుపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

ద్విభాషా చిత్రంగా రూపొందే ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో దిల్‌ రాజు నిర్మిస్తున్నాడు. తమన్‌ సంగీతం అందించనున్నాడు. నేటి నుంచే ఈ మూవీ రెగ్యూలర్‌ షూటింగ్‌ జరుపుకోనుందని ఈ సందర్భంగా చిత్ర బృందం స్పష్టం చేసింది. ఇందులో విజయ్‌ సరసన రష్మిక మందన్నా నటిస్తుండగా.. సీనియర్‌ నటుడు శరత్‌ కుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. త్వరలోనే మిగతా నటీనటులకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement