 
													నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం 'అఖండ' బ్లాక్‌బస్టర్ హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఊపులో బాలయ్య సినిమాల పరంగా దూసుకుపోతున్నాడు. ఈ నెక్ట్ ప్రాజెక్ట్ ప్రముఖ డైరెక్టర్ గోపిచంద్ మిలినేనితో చేస్తున్న విజయం విధితమే. ఇప్పటికే ఈ మూవీని ప్రకటించిన చిత్ర బృందం ఎన్‌బీకే 107నే వర్కింగ్ టైటిల్‌తో చిత్రాన్ని ప్రారంభించింది.
చదవండి: మహేశ్ బాబు ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన ‘పుష్పరాజ్’, ఫ్యాన్స్ ఫిదా

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. గోపిచంద్ మలినేని మాస్ డైరెక్టర్, బాలకృష్ణ మాస్ హీరో. మరీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో ప్రతినాయకుడిగా కన్నడ నటుడు దునియా విజయ్‌ని తీసుకున్నట్లు ఇటీవల మేకర్స్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ఇచ్చిన అప్‌డేట్ చూస్తుంటే ఈ చిత్రంలో మరో విలన్ పాత్రకు పవర్ ఫుల్ లేడి పాత్ర ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. కాగా బుధవారం చిత్ర బృందం ఎన్‌బీకే 107 నుంచి ఓ ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చింది.
చదవండి: Sanjjanaa Galrani: విడాకులపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

ఈ ప్రాజెక్ట్‌లో ప్రముఖ దక్షిణాది లేడి విలన్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా బాగస్వాయ్యం అవుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆమెను సెట్స్‌లోకి ఆహ్వానిస్తూ వరలక్ష్మి శరత్ కుమార్ పోస్టర్ రిలీజ్ చేశారు. తమిళనాట తిరుగులేని విలన్‌గా కొనసాగుతోన్న వరలక్ష్మి శరత్ కుమార్ బాలయ్య చిత్రంలో ఎలాంటి పాత్రలో కనిపించనుందనేది ఆసక్తిగా మారింది. లేడీ విలన్ పాత్రలకు వరలక్ష్మీ కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకొవచ్చు. ఇక తెలుగులోను తెలుగులో 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్'లోను .. 'క్రాక్' సినిమాలో జయమ్మగాను ఆమె తన విలనిజాన్ని చూపించింది. ఇక బాలయ్యను కూడా ఆమె ఏ రేంజ్‌లో ఢీ కోట్టనుందో చూడాలి.
Team #NBK107 welcomes the most talented & versatile actress @varusarath5 on board 💥💥
— Mythri Movie Makers (@MythriOfficial) January 5, 2022
NataSimham #NandamuriBalakrishna @shrutihaasan @officialviji @megopichand @MusicThaman pic.twitter.com/0KjcvVtsKZ

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
