
ఆ జాబితాలో రామ్‌చరణ్, ఉపాసన జంట కూడా ఉంది. కానీ వీరిద్దరూ..
బాలీవుడ్ ప్రేమజంట కియారా అద్వానీ- సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లిబంధంతో ఒక్కటైంది. వేదమంత్రాల సాక్షిగా ఫిబ్రవరి 7న వీరిద్దరూ ఏడడుగులు నడిచారు. ప్రేమపాఠాలకు ఫుల్‌స్టాప్ పెట్టి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లికి సినీతారలు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. టాలీవుడ్ సెలబ్రిటీలకు సైతం ఈ వివాహానికి హాజరు కావాలంటూ ఆహ్వానాలు అందాయి. అందులో రామ్‌చరణ్- ఉపాసన జంట కూడా ఉంది. కానీ పలు కారణాల రీత్యా వీరు కియారా వెడ్డింగ్‌కు హాజరు కాలేకపోయారు.
తాజాగా కియారా పెళ్లి ఫోటోలు షేర్ చేయగా ఉపాసన వారికి శుభాకాంక్షలు చెప్తూనే ఆపై సారీ చెప్పింది. 'ఇద్దరూ చూడచక్కగా ఉన్నారు. మేము పెళ్లికి రాలేకపోయినందుకు సారీ' అంటూ కామెంట్ చేసింది. కాగా సమంత, ఆలియా భట్, కత్రినా కైఫ్, వరుణ్ ధామన్, విక్కీ కౌశల్, అనిల్ కపూర్, అనుపమ పరమేశ్వరన్ సహా పలువురు తారలు కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్తూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: ఆధ్యాత్మిక సేవలో తమన్నా భాటియా