ప్రతి ఒక్కరినీ క్షమాపణలు కోరుతున్నాం: ఏజెంట్ నిర్మాత | Sakshi
Sakshi News home page

Agent Movie: ఏజెంట్ విషయంలో బ్లండర్ మిస్టేక్ చేశాం: అనిల్ సుంకర

Published Mon, May 1 2023 6:23 PM

Tollywood Producer Anil Sunkara Respond on Akhil Agent Movie - Sakshi

అక్కినేని అఖిల్, సాక్షి వైద్య జంటగా నటించిన  చిత్రం ‘ఏజెంట్‌’. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సారైనా అఖిల్ హిట్‌ కొడతాడని భావించినా అభిమానులకు నిరాశ తప్పలేదు. అయితే తాజాగా ఈ మూవీ ఫలితంపై టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర ట్వీట్ చేశారు. ఏజెంట్‌ మూవీ ఫ్లాప్‌కు పూర్తి బాధ్యత తమదేనని వెల్లడించారు. 

(ఇది చదవండి: కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ వీడియో)

అనిల్ సుంకర ట్వీట్‌లో రాస్తూ.. 'ఏజెంట్‌ మూవీపై వస్తున్న విమర్శలకు మాదే పూర్తి బాధ్యత. ఇది ఒక పెద్ద టాస్క్ అని తెలుసు. కానీ దాన్ని జయించగలమని అనుకున్నాం. ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభించడంలో పొరపాట్లు చేశాం. కొవిడ్ వల్ల మరిన్ని ఇబ్బందులు పడ్డాం. అయితే దీనికి ఎలాంటి సాకులు నేను చెప్పదలచుకోలేదు. చాలా పెద్ద మిస్టేక్ చేశాం. ఈ సినిమాతో చాలా నేర్చుకున్నాం. మరోసారి ఇలాంటివీ పునరావృతం కాకుండా చూసుకుంటాం. మా చిత్రబృందంపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరినీ క్షమాపణలు కోరుతున్నాం. రాబోయే ప్రాజెక్టుల్లో ఇలాంటి నష్టం జరగకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తాం.' అని పోస్ట్ చేశారు. ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మించగా.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్‌ రెడ్డి-2 బ్యానర్స్‌పై తెరకెక్కించారు. 

(ఇది చదవండి: ‘ఏజెంట్‌’కు ఊహించని కలెక్షన్స్‌.. తొలి రోజు ఎంతంటే..?)

Advertisement
Advertisement