Tollywood Chief Makeup Man Gangadhar Passed Away Due To COVID-19 - Sakshi
Sakshi News home page

సెలబ్రిటీల మేకప్‌ మ్యాన్‌ కన్నుమూత

May 18 2021 2:32 PM | Updated on May 18 2021 3:10 PM

Tollywood Chief Makeup Man Gangadhar Passed Away Due To COVID 19 - Sakshi

సుమారు పాతికేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన ఉత్తమ మేకప్‌ మ్యాన్‌గా నంది అవార్డును సైతం అందుకున్నాడు..

ప్రాణాంతక కరోనా వైరస్‌ కారణంగా ఎంతోమంది సినీ ప్రముఖులు అసువులు బాసారు. తాజాగా ప్రముఖ తెలుగు మేకప్‌ మ్యాన్‌ గంగాధర​ కరోనాతో కన్నుమూశాడు. కొద్దిరోజుల క్రితం కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్న ఆయనకు ఫలితాల్లో పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా.. మంగళవారం తుది శ్వాస విడిచాడు.

సుమారు పాతికేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన తెలుగు, తమిళ, కన్నడ, బాలీవుడ్‌ హీరోలకు మేకప్‌మెన్‌గా పని చేశాడు. ఉత్తమ మేకప్‌ మ్యాన్‌గా నంది అవార్డును సైతం అందుకున్నాడు. అంతేకాకుండా హీరో శివాజీకి వ్యక్తిగత మేకప్‌ మ్యాన్‌గానూ పని చేశాడు. ఆయన మృతి పట్ల హీరో శివాజీ, నిర్మాత బెక్కెం వేణు గోపాల్‌ సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

చదవండి: OTT: ఈ పాపులర్‌ సినిమాలు చూశారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement