Know Reason Behind Sumanth Not Attend To Sitaram Movie Success Meet, Deets Inside - Sakshi
Sakshi News home page

Sumanth: సీతారామం సక్సెస్‌ మీట్‌కు సుమంత్‌ గైర్హాజరు, ఎందుకో చెప్పిన హీరో

Aug 11 2022 6:00 PM | Updated on Aug 11 2022 6:49 PM

Sumanth Not Attend To Sitaram Movie Success Meet - Sakshi

తాను కోవిడ్‌ బారిన పడినందువల్లే ఈవెంట్‌కు రాలేకపోయానని తెలిపాడు. సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు, అలాగే సక్సెస్‌ మీట్‌కు హాజరైన తన చిన్నమామయ్య

ఎన్నో సినిమాల్లో హీరోగా నటించిన సుమంత్‌ సీతారామం సినిమాలో బ్రిగేడియర్‌ విష్ణుశర్మగా సపోర్టింగ్‌ రోల్‌ చేశాడు. ఈ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. సినిమా హిట్‌ కూడా అయింది. అయినా సినిమా సక్సెస్‌ పార్టీలో సుమంత్‌ ఎక్కడా కనిపించలేదు. దీనికి కారణమేంటనేది ఆయన చెప్పుకొచ్చాడు.

తాను కోవిడ్‌ బారిన పడినందువల్లే ఈవెంట్‌కు రాలేకపోయానని తెలిపాడు. సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు, అలాగే సక్సెస్‌ మీట్‌కు హాజరైన తన చిన్నమామయ్య నాగార్జున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ట్వీట్‌ చేశాడు. ఇదిలా ఉంటే సుమంత్‌ హీరోగా రెండు సినిమాలు చేస్తున్నాడు. అలాగే ఓటీటీ నుంచి ఆఫర్స్‌ వస్తున్నాయని, కథ నచ్చితే తప్పకుండా చేస్తానని చెబుతున్నాడు.

చదవండి:  ఆ హీరోయిన్‌తో బ్రేకప్‌, మరొకరితో డేటింగ్‌? స్పందించిన హీరో
జైభీమ్‌ వివాదం: హైకోర్టులో సూర్య దంపతులకు ఊరట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement