SS Rajamouli Gives Voice Over For Prabhas Radhe Shyam Telugu Version Deets Here - Sakshi
Sakshi News home page

Radhe Shyam: ప్రభాస్‌ కోసం రంగంలోకి రాజమౌళి!

Feb 27 2022 4:32 PM | Updated on Feb 27 2022 4:53 PM

SS Rajamouli Gives Voice Over For Radhe Shyam Telugu Version - Sakshi

SS Rajamouli Gives Voice Over For Prabhas Movie: రాజమౌళి , ప్రభాస్ కాంబినేషన్ అంటే చిన్న విషయం కాదు.ఎప్పుడెప్పుడు వీరిద్దరు మళ్లీ చేతులు కలుపుతారా అని ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ గా బాహుబలి సిరీస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కాని ఇటు రాజమౌళి, అటు ప్రభాస్ ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు.ఇండియన్ సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లడమే పనిగా పెట్టుకున్నారు. అయితే తాజాగా వీరిద్దరు మరోసారి చేతులు కలుపుతున్నారు. అంటే వీరిద్దరి కాంబోలో మరో మూవీ వస్తుందని అనుకోకండి. అల్రేడీ తెరకెక్కిన ‘రాధేశ్యామ్‌’కోసం ప్రభాస్‌, రాజమౌళి చేతులు కలిపారు.  

మార్చి 11న రాధేశ్యామ్ రిలీజ్ అవుతోంది.అందుకే సినిమా యూనిట్ ప్రమోషన్ పై ఫోకస్ పెట్టింది.ఇప్పటికే న్యూ వీడియో సాంగ్స్ రిలీజ్ అయ్యాయి.దర్శకుడు రాధాకృష్ణ కూడా మీడియాకు ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు.ఇప్పుడు ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు స్వయంగా రాజమౌళి రంగంలోకి దిగుతున్నాడు.త్వరలో ‘రాధేశ్యామ్‌’నుంచి కొత్త ట్రైలర్‌ రాబోతుంది. ఈసారి సినిమా నుంచి పూర్తిగా కొత్త కంటెంట్ ఆ ట్రైలర్ లో కనిపించబోతున్నాయి.పైగా ఫుల్ ఫామ్ లో ఉన్న తమన్ ఈ సినిమా ట్రైలర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.అందుకే బాలీవుడ్ వర్షన్ రాధేశ్యామ్ ట్రైలర్ కు అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ అందిస్తుండగా, తెలుగు వర్షన్ రాధేశ్యామ్ ట్రైలర్ కు దర్శకధీరుడు రాజమౌళి వాయిస్ ఓవర్ అందించబోతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement