దర్శకుడి అభ్యర్థన: 24 గంటల్లో సాయం చేసిన సోనూసూద్

సాధారణంగా హీరోలు మంచివాళ్లుగా, విలన్లు చెడ్డవాళ్లుగా కనిపిస్తారు. కానీ అది కేవలం స్క్రీన్ మీద మాత్రమే. రియల్ లైఫ్‌లో ఇది భిన్నంగా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువగా విలన్ పాత్రలు వేసే ఓ వ్యక్తి మాత్రం గడ్డు కాలంలో ఉన్న అందరినీ ఆదుకుంటూ హీరో అయ్యాడు, ప్రజల గుండెల్లో దేవుడిగా కొలువుదీరాడు. అతడే సోనూసూద్... ఆపదలో ఉన్నవారికి అయినవారే అడుగు దూరంగా ఉంటున్న ఈ రోజుల్లో సోనూసూద్ మాత్రం అందరికీ సాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నాడు.
Every single medicine you will get brother.
Let's save lives 🇮🇳@SoodFoundation https://t.co/zwmQXlxs8g— sonu sood (@SonuSood) May 8, 2021
తాజాగా దర్శకుడు మెహర్ రమేశ్.. వెంకట రమణ అనే రోగి కోసం కొన్ని ఇంజక్షన్లు, మెడిసిన్లు కావాలని కోరుతూ ట్వీట్ చేశాడు. ఎంత ప్రయత్నించినా అవి సమకూర్చలేకపోయానని, దయచేసి అతడికి సాయం చేయండంటూ సోనూసూద్‌ను అభ్యర్థించాడు. ఈ విషయంలో మీరు, మీ ఫౌండేషన్ మాత్రమే సాయం చేయగలరని చేతులెత్తి వేడుకున్నాడు. ఈ ట్వీట్ చేసిన 24 గంటల్లో సోనూసూద్ ఆ మెడిసిన్స్‌ను దర్శకుడికి అందజేశాడు. దీంతో మెహర్ రమేశ్ అతడికి కృతజ్ఞతలు తెలియజేశాడు. సకాలంలో వాటిని ఇంత వేగంగా అందించడం మీకు మాత్రమే సాధ్యమైందంటూ ప్రశంసించాడు. ఇదిలా వుంటే ప్రస్తుతం మెహర్ రమేశ్.. మెగాస్టార్ చిరంజీవితో 'వేదాళం' రీమేక్ ప్లాన్ చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు కనిపిస్తోంది.
Anything for you brother🙏
Thanks for helping us save a life 🇮🇳@SoodFoundation https://t.co/JY4q36ObpL— sonu sood (@SonuSood) May 8, 2021