
‘ఐయామ్ బ్యాక్’ అంటున్నారు సమంత. 2022లో తాను మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లుగా, ఇందుకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్నట్లుగా సమంత వెల్లడించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత సమంత ఎక్కువ సినిమాలు సైన్ చేయలేదు. గత ఏడాది జూలైలో చికిత్సలో భాగంగా ఓ ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటానని తెలిపారు సమంత.
అయితే ఇప్పుడు అనారోగ్య ఇబ్బందులు లేవనీ, పూర్తి స్థాయిలో ‘ఐయామ్ బ్యాక్ టు వర్క్’ అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు సమంత. గత కొన్ని నెలల విరామంలో ఆరోగ్యం గురించి కొన్ని పాడ్‌కాస్ట్‌లు చేసినట్లు, త్వరలోనే అవి విడుదల చేయనున్నట్లు కూడా ఆమె తెలిపారు. ఇక ‘ది ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్ తర్వాత సమంత నటించిన ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ ఈ వేసవిలో స్ట్రీమింగ్ కానుంది. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ వెబ్ సిరీస్‌కు ‘ది ఫ్యామిలీమేన్’ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు.