నా ఇంటికి ఎవరూ రావద్దు: సల్మాన్‌ | Salman Khan Appeal Fans Not Gather Outside Home | Sakshi
Sakshi News home page

నా ఇంటికి ఎవరూ రావద్దు: సల్మాన్‌

Dec 26 2020 8:39 PM | Updated on Dec 26 2020 8:39 PM

Salman Khan Appeal Fans Not Gather Outside Home - Sakshi

ముంబై: బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ రేపు 55వ వడిలోకి అడుగు పెట్టనున్నారు. ఆయన పుట్టిన రోజు గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసేందుకు అభిమానులు ఇప్పటికే రెడీ అయ్యారు. అయితే ఆయనతో ఒక్క ఫొటో దిగాలన్న కోరిక, నేరుగా విషెస్‌ చెప్పాలన్న ఆత్రంతో ప్రతి యేడు సల్మాన్‌ ఇంటి ముందు వందలాది మంది పోగయ్యేవారు. ఈ నేపథ్యంలో అభిమానులెవరూ తన ఇంటికి రావద్దని ముందుగానే చెప్తున్నారు సల్లూభాయ్‌. ముంబైలో తను నివసించే గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ ముందు జనాలెవరూ పోగవకండంటూ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అపార్ట్‌మెంట్‌ గేటుకు ఓ నోటీసు అంటించారు. "ప్రతి ఏటా నా పుట్టిన రోజున అభిమానులు నాపై ఎంతగానో ప్రేమాభిమానాలు కురిపించేవారు. కానీ ఈసారి కరోనా మహమ్మారి కాచుకుని కూర్చున్నందున దానిని దృష్టిలో ఉంచుకుని ఎవరూ ఇంటి ముందు గుమిగూడొద్దని కోరుతున్నాను. ప్రస్తుతానికి నేను అపార్ట్‌మెంట్‌లో కూడా లేను. మీరందరూ మాస్కు పెట్టుకోండి, సానిటైజర్‌ రాసుకోండి, భౌతిక దూరం పాటించండి" అని రాసుకొచ్చారు. (చదవండి: ప్లేట్లు నేలకేసి కొట్టిన హీరో‌ సోదరి!)

కాగా సల్మాన్‌ ప్రస్తుతం బుల్లితెర హిట్‌ షో బిగ్‌బాస్‌ హిందీ 14వ సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఆయన 55వ పుట్టిన రోజును షోలోనే ఘనంగా సెలబ్రేట్‌ చేసినట్లు కనిపిస్తోంది. ఈ వేడుకలకు నటీమణులు రవీనా టండన్‌, షెహనాజ్‌ గిల్‌ కూడా విచ్చేశారు. ఈ మేరకు రిలీజైన బిగ్‌బాస్‌ ప్రోమో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక సల్మాన్‌ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం 'అంతిమ్‌(ఆఖరిది)' సినిమాలో నటిస్తున్నారు. మహేశ్‌ మంజ్రేకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్‌ సిక్కు పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారు. (చదవండి: స్నానానికి వెళ్లి  చనిపోయిన  ప్రముఖ మలయాళ నటుడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement