SS Rajamouli RRR Movie Release Date Postponed - Sakshi
Sakshi News home page

RRR Movie: ‘అప్పుడే ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల తేదీ ప్రకటిస్తాం’

Sep 12 2021 1:08 PM | Updated on Sep 20 2021 11:31 AM

RRR Movie Postponed Again And Release Date Announce Soon - Sakshi

‘బాహుబలి’ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌) సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబరు 13న థియేటర్స్‌లో విడుదల చేయడం లేదని చిత్రబృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. ‘‘సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ పూర్తి కావొచ్చాయి. అక్టోబరు కల్లా రెడీ అవుతుంది. కానీ ముందుగా అనుకున్నట్లు అక్టోబరు 13న విడుదల చేయడం లేదు. వాయిదా వేస్తున్నాం. అలాగే థియేటర్స్‌ రీ ఓపెనింగ్‌ విషయంలో అక్కడక్కడా అనిశ్చితి ఉన్నందున ఇప్పుడే మా సినిమా కొత్త విడుదల తేదీని చెప్పలేకపోతున్నాం.

చదవండి: వడివేలు జీవితాన్ని మలుపు తిప్పిన రైలు జర్నీ

ప్రపంచవ్యాప్తంగా సినిమా మార్కెట్‌ రన్నింగ్‌లో ఉన్నప్పుడు విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో ఒలీవియా మోరిస్, ఆలియా భట్‌ హీరోయిన్లుగా నటించారు. డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. ఇప్పటికే రెండుసార్లు (2020 జూలై 30, 2021 జవనరి 8) వాయిదా పడిన ఈ చిత్రం మూడోసారి వాయిదా పడింది. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా ఉగాదికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారని ఫిల్మ్‌నగర్‌లో టాక్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement