
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, రాజమౌళి, కీరవాణి సహా తదితరులు అమెరికాకు చేరుకున్నాను. తాజాగా యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అమెరికాకు పయనమయ్యాడు. సోమవారం ఉ
పాన్ ఇండియా మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్' అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది. గోల్డెన్ గ్లోబ్, హెచ్‌సీఏ, లాస్ ఏంజిల్స్ ఫిలిం క్రిటిక్స్, క్రిటిక్స్ చాయిస్.. వంటి అవార్డులు ఎగరేసుకుపోయిన ఈ చిత్రం ప్రస్తుతం ఆస్కార్ రేసులో ఉంది. మార్చి 13న జరగనున్న 95వ అకాడమీ అవార్డుల వేడుక కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ఈ ఈవెంట్ కోసం మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, రాజమౌళి, కీరవాణి సహా తదితరులు అమెరికాకు చేరుకున్నారు. తాజాగా యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అమెరికాకు పయనమయ్యాడు. సోమవారం ఉదయం తారక్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మొత్తానికి మా హీరో కూడా ఆస్కార్ వేడుకల్లో పాల్గొనబోతున్నాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌కు వెళ్లాల్సి ఉండగా తారకరత్న మృతి చెందడంతో వాయిదా పడింది. ప్రస్తుతం ఆస్కార్ వేడుకల కోసం అమెరికాకు వెళ్లిన యంగ్ టైగర్ వచ్చీరాగానే NTR30 మీద పూర్తిస్థాయిలో దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్‌ను తీసుకోనున్నట్లు సమాచారం.