Ramarao On Duty Release Date: రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ డేట్ ఫిక్స్..

Ravi Teja Ramarao On Duty New Release Date Announced: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా, మాస్ మహారాజాగా ఎదిగాడు రవితేజ. హిట్లు, ప్లాప్‌లు పట్టించుకోకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటాడు. ఇటీవల క్రాక్‌తో హిట్ కొట్టిన ఖిలాడీ అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం రవితేజ చేతిలో ఐదు సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో ఒకటి 'రామారావు ఆన్ డ్యూటీ'. ఇప్పటివరకు ఈ మూవీ విడుదల తేది పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజగా మరోసారి రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్.
శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుట్లు తెలిపారు. విడుదల తేదిని ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో రవితేజ ధీర్ఘంగా, సీరియస్‌గా ఆలోచిస్తున్న ఫొటోను చూడోచ్చు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో 'మజిలీ' ఫేమ్ దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి నటిస్తూ వెండితెరకు రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.
చదవండి: రణ్‌బీర్ వీరోచిత పోరాటం.. ఆసక్తిగా 'షంషేరా' టీజర్
The calm before the MASS Storm!#RamaRaoOnDuty Grand Release Worldwide on JULY 29 💥#RamaRaoOnDutyOnJULY29
Mass Maharaja @RaviTeja_offl @directorsarat @itsdivyanshak @rajisha_vijayan @SamCSmusic @sahisuresh @Cinemainmygenes @sathyaDP @RTTeamWorks @LahariMusic pic.twitter.com/k0527vUTps
— SLV Cinemas (@SLVCinemasOffl) June 22, 2022