Rashmika Mandanna : మరోసారి నితిన్‌కి జోడీగా రష్మిక మందన్నా.. క్రేజీ అనౌన్స్‌మెంట్‌

Rashmika Mandanna To Pair Up With Nithin Movie Announced - Sakshi

హీరో నితిన్‌, హీరోయిన్‌ రష్మికా మందన్నా మరోసారి జోడీగా నటించనున్నారు. గతంలో భీష్మ చిత్రంలో వీరు తొలిసారిగా స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే.

తాజాగా మరోసారి ఈ కాంబో రిపీట్‌ కానుంది. దీనికి సంబంధించి మేకర్స్‌ అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ కూడా చేసేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్నారు. ఇంట్రడక్షన్‌ వీడియోతోనే సినిమాపై బజ్‌ను క్రియేట్‌ చేశారు.

త్వరలోనే ఈ చిత్రం టైటిల్‌ను అనౌన్స్‌ చేయనున్నారు. కొంతకాలంగా సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్న నితిన్‌కు ఈ సినిమా అయినా సక్సెస్‌ ఇస్తుందా అన్నది చూడాల్సి ఉంది. 

 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top