
తండ్రే తనకు ఇన్‌స్పిరేషన్ అంటున్నాడు మెగా హీరో రామ్‌చరణ్ (Ram Charan). నేడు (ఆగస్టు 22) చిరంజీవి (Chiranjeevi Konidela) 70వ పుట్టినరోజు. ఈ సందర్భంగా తండ్రితో కేక్ కట్ చేయించి, బర్త్‌డే సెలబ్రేట్ చేశాడు చరణ్. తండ్రి పాదాలకు నమస్కరించి ఆయన్ను మనసారా హత్తుకున్నాడు. అనంతరం చిరంజీవికి కేక్ తినిపించాడు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.
నా హీరో..
నాన్నా.. ఈరోజు కేవలం నీ పుట్టినరోజు మాత్రమే కాదు. నీలాంటి మనిషిని సెలబ్రేట్ చేసుకునే రోజు. నా హీరో, నా గైడ్, నా ఇన్‌స్పిరేషన్.. అన్నీ నువ్వే! నా ప్రతి విజయం, నేను పాటించే విలువలన్నీ నీ నుంచి వచ్చినవే.. 70 ఏళ్ల వయసు వచ్చినా నీ మనసు మాత్రం చిన్నపిల్లాడిలా మారిపోతోంది. నువ్వు సంపూర్ణ ఆరోగ్యంతో, సుఖ సంతోషాలతో మరెన్నో యేళ్లు గడపాలని కోరుకుంటున్నాను. ఉత్తమ తండ్రిగా ఉన్నందుకు థాంక్యూ నాన్న.. అంటూ రామ్‌చరణ్ ఎమోషనల్ అయ్యాడు.
చదవండి: వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్.. చిరుకు అల్లు అర్జున్ బర్త్‌డే విషెస్