వన్‌ అండ్‌ ఓన్లీ మెగాస్టార్‌.. చిరుకు అల్లు అర్జున్‌ బర్త్‌డే విషెస్‌ | Megastar Chiranjeevi Turns 70: Allu Arjun, Venkatesh & Celebs Pour in Birthday Wishes | Sakshi
Sakshi News home page

Chiranjeevi 70th Birthday: మెగాస్టార్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పిన ఐకాన్‌ స్టార్‌

Aug 22 2025 11:09 AM | Updated on Aug 22 2025 11:28 AM

Chiranjeevi 70th Birthday: Allu Arjun Special Wishes to Megastar

మెగాస్టార్‌ చిరంజీవి (Konidela Chiranjeevi) నేడు (ఆగస్టు 22న) 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తన డ్యాన్స్‌, స్టైల్‌, యాక్టింగ్‌, యాక్షన్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఏడు పదుల వయసులోనూ తగ్గేదేలే అంటూ యాక్షన్‌కు సై అంటున్నారు. అలాంటి మెగాస్టార్‌కు సోషల్‌ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తున్నారు.

వన్‌ అండ్‌ ఓన్లీ మెగాస్టార్‌
తాజాగా అల్లు అర్జున్‌ (Allu Arjun).. తన మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. వన్‌ అండ్‌ ఓన్లీ మెగాస్టార్‌ చిరంజీవిగారికి హ్యాపీ బర్త్‌డే అని ట్వీట్‌ చేశాడు. దీనికి చిరుతో కలిసి డ్యాన్స్‌ చేస్తున్న ఫోటో జత చేశాడు. మెగాస్టార్‌పై తనకున్న అభిమానం, గౌరవాన్ని ఇలా ట్వీట్‌ రూపంలో వ్యక్తం చేశాడు బన్నీ. వెంకటేశ్‌, సాయిదుర్గ తేజ్‌, తేజ సజ్జా, నారా రోహిత్‌.. ఇలా తదితరులు మెగాస్టార్‌కు సామాజిక మాధ్యమాల్లో బర్త్‌డే విషెస్‌ చెప్పారు.

 

 

 

 

చదవండి: నా కూతురి ఆరోగ్యం కోసం రోజూ ఈ ఫుడ్‌ తప్పనిసరి: ఉపాసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement