టాలీవుడ్‌ నిర్మాత సీఎన్‌ రావు కన్నుమూత | Producer Chitti Nageswar Rao Lost Life Due To Coronavirus | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌ నిర్మాత సీఎన్‌ రావు కన్నుమూత

Apr 21 2021 7:55 AM | Updated on Apr 21 2021 12:26 PM

Producer Chitti Nageswar Rao Lost Life Due To Coronavirus - Sakshi

కరోనా కారణంగా నిర్మాత సీఎన్‌ రావు (చిట్టీ నాగేశ్వరరావు) కన్నుమూశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో మృతి చెందారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో జన్మించిన సీఎన్‌ రావు పంపిణీదారునిగా, నిర్మాతగా సుపరిచితులే. తెలుగులో ‘మా సిరిమల్లె, అమ్మా నాన్న లేకుంటె, బ్రహ్మానందం డ్రామా కంపెనీ’ చిత్రాలు, తమిళ్‌లో ‘ఊరగా’ అనే సినిమా నిర్మించారాయన.

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శి, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సభ్యుడు, తెలుగు చలన చిత్ర నిర్మాతల సెక్టార్‌ సెక్రటరీగా, సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ అఫ్‌ కామర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తించారాయన. గతంలో ఫిల్మ్‌ ఫెడరేషన్‌ అఫ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యునిగానూ చేశారు సీఎన్‌ రావు. 

చదవండి: బస్సు మీద మంగ్లీ పోస్టర్లు: సింగర్‌ ఎమోషనల్‌

కరోనా కష్టాలు మామ.. సినిమా చూపలేము మామా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement