బాలీవుడ్‌ సింగ‌ర్ త‌ల్లి మృ‌తి | Papon Mother, Assamese Singer Archana Mahanta Passed Away | Sakshi
Sakshi News home page

అస్సాం గాయ‌ని మృ‌తి: సీఎం సంతాపం

Aug 27 2020 6:52 PM | Updated on Aug 27 2020 6:57 PM

Papon Mother, Assamese Singer Archana Mahanta Passed Away - Sakshi

గువ‌హ‌టి: ప్ర‌ముఖ బాలీవుడ్‌ సింగ‌ర్ పాపోన్ త‌ల్లి, అల‌నాటి అస్సాం గాయని అర్చ‌న మ‌హంత(72) మ‌ర‌ణించారు. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతోన్న ఆమె గువ‌హ‌టిలోని హెల్త్ సిటీ ఆస్ప‌త్రిలో గురువారం తుది శ్వాస విడిచారు. కాగా జూలై 14న ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్(ప‌క్ష‌వాతం) రావ‌డంతో ఆస్ప‌త్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అప్ప‌టికే ఆమె మ‌ధుమేహం, అధిక ర‌క్త‌పోటు, పార్కిన్‌స‌న్ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ రావ‌డంతో శ‌రీరం ఎడ‌మ వైపు అంతా చ‌చ్చుబ‌డిపోయింది. దీంతో ఆమె ఆరోగ్యం మ‌రింత క్షీణించ‌డంతో ప్రాణాలు విడిచారు. ((చ‌ద‌వండి: అంతరిక్షం కూడా ఆయన పేరు దాచుకుంది)

ఆమె మ‌ర‌ణం ప‌ట్ల అస్సాం ముఖ్య‌మంత్రి స‌ర్బానంద సోనోవాల్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. "అస్సామీ ఫోక్ సింగ‌ర్ అర్చ‌న మ‌హంత ఇక లేర‌న్న వార్త న‌న్ను క‌లిచివేస్తోంది. నేడు ఓ ప్ర‌తిభావంతురాలిని రాష్ట్రం కోల్పోయింది. నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిద్దాం" అంటూ ట్వీట్ చేశారు. కాగా అర్చ‌న మ‌హంత సాంప్ర‌దాయ గాయ‌ని. ఆమె భ‌ర్త కూడా సింగ‌రే. అనేక కార్య‌క్ర‌మాల్లో వీరిద్ద‌రూ క‌లిసి పాట‌లు పాడేవారు. వీరికి జ‌న్మించిన కుమారుడు పాపోన్ కూడా సింగ‌ర్‌గానే రాణిస్తున్నారు. (చ‌ద‌వండి: న‌కిలీ ఫాలోవ‌ర్ల స్కామ్‌లో ర్యాప‌ర్‌)

Advertisement
 
Advertisement
Advertisement