'టెంపర్​' బ్యూటీ ఇన్​స్టా అకౌంట్ మాయం​.. అసలు సంగతి ఏంటంటే ? | Sakshi
Sakshi News home page

Nora Fatehi: 'టెంపర్​' బ్యూటీ ఇన్​స్టా అకౌంట్ మాయం​.. అసలు సంగతి ఏంటంటే ?

Published Sat, Feb 5 2022 1:35 PM

Nora Fatehi Return To Instagram After Hacking Attempt - Sakshi

Nora Fatehi Return To Instagram After Hacking Attempt: బాలీవుడ్​ హాట్​ బ్యూటీ నోరా ఫతేహీ తన క్రేజీ బాడీ మూమెంట్స్​తో మెస్మరైజ్ చేస్తుంది. స్పెషల్​ సాంగ్స్​లో ప్రత్యేకంగా కనిపించడమే కాకుండా తన ఎక్స్​ప్రెషన్స్​తో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ప్రత్యేక గీతాల్లోనే కాదు, సోషల్​ మీడియాలో కూడా హైపర్​ యాక్టివ్​గా ఉంటూ తన ఫొటోస్​, వీడియోస్​తో అభిమానులను ఆద్యంతం ఎంటర్​టైన్​ చేస్తుంది. అలాంటిది నోరా ఫతేహి ఇన్​స్టా అకౌంట్​ ఒక్కసారిగా మాయమైపోయింది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన సంఘటనతో నోరా ఫ్యాన్స్​ షాక్​కు గురయ్యారు. నోరానే తన ఇన్​స్టా పేజీని డిలీట్​ చేసిందని భావించారు.

అయితే అదే రోజు రాత్రి అయ్యేసరికి అసలు విషయం తెలిసింది. తన అకౌంట్​ ఎవరో హ్యాక్​ చేయడానికి ప్రయత్నించారని తెలిపింది నోరా. శుక్రవారం రాత్రి మళ్లీ తన పేజీ రీస్టోర్​ అయిందని పేర్కొంది. 'అందరికీ సారీ. నా ఇన్​స్టాగ్రామ్​ ఖాతాను ఎవరో హ్యాక్ చేసేందుకు ఉదయం నుంచి ప్రయత్నించారు. కానీ ఈ సమస్యను త్వరగా పరిష్కరించారు. వారి టీమ్​కు ధన్యవాదాలు.' అని రీస్టోర్​ అయిన అకౌంట్​లో పోస్ట్​ షేర్​ చేసింది ముద్దుగుమ్మ. నోరా ఫతేహీకి ఇన్​స్టాలో 37 మిలియన్​ ఫాలోవర్స్​ ఉన్నారు. ఇటీవల నోరా ఫతేహి పులి పిల్లలకు ఆహారం పెడుతున్న వీడియో పోస్ట్​ చేశాక అకౌంట్​ హ్యాక్​ అయింది. 'బాహుబలి', 'టెంపర్'​ తదితర సినిమాల్లో నోరా ఐటమ్​ సాంగ్స్​​లో అలరించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement